ఫిలింఫేర్ అవార్డ్స్లో లో ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న సరైనోడు

- June 17, 2017 , by Maagulf
ఫిలింఫేర్ అవార్డ్స్లో లో ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న సరైనోడు

తాజాగా జరిగిన 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌కి సంబంధించి 2016లో విడుదలైన సరైనోడు సినిమాకుగాను ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) అవార్డ్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఈ అవార్డు అల్లు అర్జున్ అందుకోవడం జరిగింది.
ఈ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ. సరైనోడు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వల్లే తనకి ఈ అవార్డ్ దక్కిందని తెలిపాడు. అంతేకాకుండా ఈ అవార్డుని దాసరి నారాయణ రావు గారికి అంకితం ఇస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయం లో అభిమానులంతా డీజే..డీజే అని అరవడం తో బన్నీ నవ్వుతూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని సరదాగా ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూన్ 23 న డీజే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com