పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో మంగళవారం దారుణం
- October 13, 2015
పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని గులిస్థాన్ -ఐ- జవహర్ ప్రాంతంలోని మురికివాడపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారని కరాచీ కమిషనర్ షోయిబ్ సిద్ధిఖి వెల్లడించారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.00 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి... శిథిలాల కింద మృతదేహలను వెలికి తీసినట్లు చెప్పారు. అయితే మృతల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. మృతులంతా పంజాబ్ రాష్ట్రంలోని బహ్వాల్ పూర్, రేహ్మాయార్ ఖాన్ జిల్లాల్లోకు చెందిన వారని చెప్పరు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







