షార్లో 23న పీఎస్ఎల్వీ ప్రయోగం

- June 18, 2017 , by Maagulf
షార్లో 23న పీఎస్ఎల్వీ ప్రయోగం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 23న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి38ను పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నాటికి రాకెట్లోని శిఖరభాగాన ఉపగ్రహాలను అనుసంధానం చేసి, ఉష్ణకవచాన్ని అమర్చారు. సోమవారం గ్లోబల్ చెక్ చేపట్టనున్నారు. ఈ నెల 21న ఉదయం సన్నాహకాలు చేస్తారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ ఈ నెల 22వ తేదీ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ రాకెట్ 23వ తేదీ ఉదయం9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
నింగిలోకి 31 ఉపగ్రహాలు: పీఎస్ఎల్వీ-సి38 వాహకనౌక ఈసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇందులో భారత్కు చెందిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, తమిళనాడులోని నూర్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. గత ఏడాది జూన్ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీలలో రెండు కార్టోశాట్ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com