ఖతార్ నుంచి యూఏఈకి గ్లాస్ సప్లయ్ యధాతథం
- June 18, 2017
ఖతార్ అంబాసిడర్ టు జర్మనీ సౌద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ నుంచి 40 శాతం గ్యాస్ అవసరాలు యూఏఈకి తీరుతున్నాయని, ఈ సంబంధాలు ప్రస్తుతానికి తెగతెంపులు చేసుకోలేదని తెలిపారు. సార్జా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రీజియన్‌లో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల కారణంగా గ్యాస్ సప్లయ్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని చెప్పారాయన. అబుదాబీ - ఖతార్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ద్వారా ఇదివరకటిలానే సరఫరా జరుగుతోందని హతీమ్ అల్ మోసా చెప్పారు. డాల్ఫిన్ గ్యాప్ పైప్‌లైన్ ఖతార్ నార్త్ ఫీల్డ్‌ని యూఏఈ మరియు ఒమన్‌తో కలుపుతోంది. ఇది గల్ఫ్ రీజియన్‌లో తొలి క్రాస్ బోర్డర్ గ్యాస్ ప్రాజెక్ట్. యూఏఈకి రోజుకి 2 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్‌ని సరఫరా జరుగుతోంది ఈ పైప్‌లైన్ ద్వారా.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







