లండన్ సెవెన్ సిస్టర్స్ రోడ్డులో కలకలం
- June 18, 2017
పది రోజులు కూడా పూర్తవకముందే లండన్లో మరో దుర్మార్గం. గతంలో మాదిరిగానే పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి భీభత్సం సృష్టించింది. సరిగ్గా లండన్లోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సమీపంలోనే ఫిన్స్బరీ పార్క్ మసీదు ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగిసన తర్వాత ఈ మార్గం నుంచే ముస్లిలు వెళుతుంటారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వాహన డ్రైవర్ను అరెస్టు చేశారు.
ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని శోధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదిమిందిని ఈ వాహనం ఢీకొట్టింది. అంతకుముందు లండన్ బ్రిడ్జిపై కూడా ఉగ్రవాదుల వాహనం పాదచారులపైకి దూసుకెళ్లి పలువురు చనిపోయేందుకు కారణమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఘటనపట్ల పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







