యామురిక్క భయమెయ్ సినిమాను తెలుగులో రీమేక్
- October 13, 2015
భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న మెగా వారసుడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తొలి సినిమాతో చేదు అనుభవాన్నే మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా నటన పరంగా ఏ మాత్రం ఆకట్టుకోవలేకపోవటంతో విమర్శలు ఎదుర్కొవలసి వచ్చింది. ఆ తరువాత రూటు మార్చి కమర్షియల్ జానర్ లో రెజీనాతో కలిసి 'కొత్త జంట' సినిమా చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శిరీష్. కోలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'యామురిక్క భయమెయ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. హర్రర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన డికే దర్శకత్వంలోనే చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి శిరిష్ రీమేక్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







