హీరో సూర్యకు విలన్‌గా కార్తీక్
- June 18, 2017
నవరస నాయకుడు కార్తీక్ మళ్లీ విలన్‌గా నటించ బోతున్నారు. 'రావణన్' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగు తున్న కార్తీక్ 'అనేగన్'లో విలన్ పాత్రలో కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తరువాత హీరోగా 'అమరన్' సీక్వెల్‌ను ప్రారంభించారు. అయితే ఆర్ధిక కారణాలతో ఆ చిత్రం ప్రారంభంలోనే ఆగి పోయినట్టు సమాచారం. ఈ నేపథ్యం లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందు తున్న 'తానా సేర్న్ద కూట్టం'లో కార్తీక్ ముఖ్య పాత్ర పోషి స్తున్నారు. సూర్య, కార్తీక్ కలిసి నటించడం ఇదే తొలిసారి. కీర్తి సురేష్ హీరో యిన్‌గా, రమ్యకృష్ణన్, ఆనంద్ రాజ్, కోవై సరళ, తంబి రామయ్య, ఆర్జే బాలాజీ తదితరులు సహాయపాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కార్తీక్ విలన్ పాత్ర పోషిస్తున్నారని, 'అనేగన్' తరహాలోనే స్టైలిష్ విలనీజాన్ని 'తానా సేర్న్ద కూట్టం'లోను కార్తీక్ తెరపై పండించబోతున్నారని యూనిట్ సభ్యుల సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







