హత్య కేసులో 30 మందికి మరణశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు
- June 19, 2017
ఈజిప్టులోని ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య కేసులో 30 మందికి ఉరిశిక్ష వేయాల్సిందిగా అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జూన్ 2015లో హిషం బారాకత్ అనే ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కొంతమంది ప్రణాళిక ప్రకారం కారుబాంబు పేల్చి చంపేశారు. 2013లో ఈజిప్టులో ప్రభుత్వాన్ని కుప్పకూల్చటంలో పాలుపంచుకున్న అనేకమందిని కోర్టు ముంగిట దోషులుగా నిలబెట్టడంలో హిషం బారాకత్ సఫలీకృతులయ్యారు. దీనిపై కొన్ని మిలిటెంట్ గ్రూపులు ఆయనపై కక్ష్యగట్టాయి. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పునకు ఈజిప్టులోని ఉన్నతస్థాయి మతాధికారులతో కూడుకున్న 'గ్రాండ్ ముఫ్తీ' ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కోర్టు తీర్పును రద్దు చేసే అధికారం 'గ్రాండ్ ముఫ్తీ'కి ఉంది.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







