ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
- June 19, 2017
రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ గవర్నర్ రామనాథ్ కోవింద్ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు. 23న రామనాథ్ కోవింద్ నామినేషన్ వేసే అవకాశముంది.
ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామనాథ్ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఆయన పేరును ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్. 1945, అక్టోబర్ 1న జన్మించిన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







