బహ్రెయిన్‌ని వీడండి: ఖతార్ సైనికులకి ఆదేశం
- June 19, 2017
మనామా: ఖతార్ సైనికులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా బహ్రెయిన్ ఆదేశించింది. బహ్రెయిన్‌లో అమెరికన్ బేస్ ఉంది. సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది నావల్ ఫోర్సెస్‌ని బహ్రెయిన్‌లో అమెరికా నిర్వహిస్తోంది. ఈ బేస్‌లో జిసిసి దేశాలకు చెందిన పలువురు సైనికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లో తీవ్రవాద కార్యకలాపాలపై ఈ బేస్ నుంచి పోరాటం జరుగుతుంటుంది. ఈ బేస్‌లోనే వివిధ దేశాలకు చెందిన సైనికులతోపాటు ఖతార్ సైనికులు కూడా ఉన్నారు. అయితే ఖతార్‌తో జిసిసికి చెందిన కొన్ని దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా, బహ్రెయిన్ తమ భూ భాగం నుంచి ఖతార్ సైనికులు వెళ్ళిపోవాలని కోరుతోంది. ఈ మేరకు బహ్రెయిన్‌లోని యూఎస్ బేస్ కమాండర్ ఇన్ఛార్జ్కి బహ్రెయిన్ లేఖ రాసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







