ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ ఫీల్డ్‌పై తీవ్రవాదుల దాడి యత్నం భగ్నం

- June 19, 2017 , by Maagulf
ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ ఫీల్డ్‌పై తీవ్రవాదుల దాడి యత్నం భగ్నం

జెడ్డా: సౌదీ రాయల్‌ నేవీ, అరేబియన్‌ గల్ఫ్‌లోని ప్రముఖమైన ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ ఫీల్డ్‌పై తీవ్రవాదులు దాడికి యత్నించగా, దాన్ని తిప్పి కొట్టింది. ఈ ఆపరేషన్‌లో ఓ బోటుని సౌదీ నేవీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బోటులో పెద్దయెత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. అయితే దాడికి ఏ గ్రూపు యత్నించిందన్న విషయాల్ని సౌదీ నేవీ వర్గాలు వెల్లడించలేదు. ఇంకో వైపున ఇరానియన్‌ మీడియా, సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌ రెండు బోట్లపై కాల్పులు జరిపారనీ, ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొంది. రెండు బోట్లు మునిగిపోయినట్లు ఇరానియన్‌ మీడియా ప్రస్తావించింది. ఇందులోంచి మృతుడి కుమారుడు బయటపడినట్లు ఇరానియన్‌ మీడియా చెబుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com