అదా ప్రదమాన్ పాయసం
- June 19, 2017
కావలసిన పదార్థాలు: అటుకులు - 100 గ్రా, బెల్లం తరుగు - పావు కిలో, పల్చని కొబ్బరి పాలు - 5 కప్పులు, చిక్కని కొబ్బరి పాలు- 1 కప్పు, నెయ్యి-2 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, కొబ్బరి ముక్కలు - 2 టే.స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని
తయారీ విధానం:
బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి.
గిన్నెలో నీళ్లు వేడి చేసి మరిగాక మంట తీసి అటుకులు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత పల్చని కొబ్బరి పాలు పోసి కలిపి చిన్న మంట మీద అటుకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చిక్కబడ్డాక బెల్లం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించి తీయాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించు కోవాలి.
అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి మంట తీసేయాలి.
కొబ్బరి పాలు పోశాక ఉడికిస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పోసిన వెంటనే మంట తీసేయాలి.
దీన్లో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







