డీజే ప్రోమోషన్స్ మొదలు

- June 19, 2017 , by Maagulf
డీజే ప్రోమోషన్స్ మొదలు

దువ్వాడ జగన్నాథమ్‌ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ రోజు ప్రింట్ మీడియాకు ఇంటర్ వ్యూలు ఇచ్చాడు అల్లు అర్జున్. రేపు టీవీ ఛానల్స్ తో ముచ్చటించనున్నాడు. ఈలోగా ఈ సినిమా కి సంబధించిన కొత్త ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. . ఈ చిత్రంలోని 'సీటీ మార్‌' అనే పాట ట్రైలర్‌నువిడుదల చేశారు.
'మెరిసే మెరుపా, సొగసే అరుపా.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, మెగాస్టార్‌ నిన్నే చూస్తే విజిలేస్తార్‌' అని సాగే ఈ పాటలో బన్నీ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. బన్నీ డ్యాన్స్ లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సింపుల్ గా అదరగొట్టేశాడు అల్లు అర్జున్. 31 సెకన్ల ఈ వీడియో యూట్యూబ్‌లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించాడు. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com