గర్భ సమయం లో దూరంగా ఉండవల్సిన ఆహారపదార్థాలు ఇవే

- June 19, 2017 , by Maagulf
గర్భ సమయం లో దూరంగా ఉండవల్సిన ఆహారపదార్థాలు ఇవే

స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం. కారణం- ఈ దశలో శరీరంలో జరిగే మార్పులు మరియు సమస్యలు ఉహకు అందని విధంగా ఉంటాయి. గర్భవతులు స్వతహాగా చాలా జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం మరియు ఆహార సేకరణలో జాగ్రత్తలు వహించటం చాలా అవసరం. గర్భ సమయంలో దూరంగా ఉండవలసిన ఆహార పట్టిక పెద్దదిగానే ఉంది. అయితే, గర్భ సమయంలో మీరు అనుసరించే ఆహర ప్రణాళికలో వీటికి దూరంగా ఉండేలా చూసుకోండి.
పండ్లు & కూరగాయలను కడగండి
బద్దకము వలన కడగటం మానేసినట్లయితే, మీరు చాలా ఇబ్బంది గురి అవ్వాల్సి వస్తుంది. కావున మీరు తినటానికి ముందు, కేవలం రెండు సార్లు అయిన కడగండి. మీరు తీసుకునే ఆహారం కడుపులో ఉన్న పాపకి అందించబడుతుంది, వాటిలో బ్యాక్టీరియా మరియు ధుమ్ము, ధూలి  ఉండే అవకాశం ఉంది కావున శుభ్రంగా కడిగి తినటం మంచిది.
మృదువైన జున్ను
మామూలు జున్నుతో పోల్చినట్లయితే చిక్కని జున్ను చాలా విధాలుగా గర్భినులకు నష్టం కలిగిస్తుంది. కావున చిక్కని జున్నుని తినడం వలన మీ శరీరంలో జరిగే మార్పులకు అసౌకర్యంగా భావిస్తారు. ముఖ్యంగా శరీర నిరోధక శక్తి మీలో పెరుగుతున్న పిండానికి రక్షణ కలిపిస్తుంది. బ్రీ, కామేమ్బెర్ట్, ఫెటా, క్వేసో బ్లాంకో, బ్లెవు వంటివి ఎక్కువ జున్నుని కలిగి ఉంటాయి.
పచ్చి గ్రుడ్లు
పచ్చి మాంసము, పచ్చి గ్రుడ్డ్లు గర్భ సమయంలో సాల్మొనెల్లా వలన కలిగే వ్యాధులను కలుగచేస్తాయి. కావున గ్రుడ్డు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి. ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బట్టర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాగ్, మాయో.. వంటివి కూడా తినకండి.
పోప్పాయ పండు
ఇది గర్భ సమయంలో తీసుకొకూడని పట్టికలో మొదటగా ఉంటుంది. దీనిని తినటం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది. పొప్పడి పండు ఎక్కువ 'లాటేక్స్'ని కలిగి ఉంటుంది, ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది. గర్భం ధరించిన మూడు నెలల తరువాత దీన్ని తినకూడదు. దీన్ని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవటం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది.
తీపి పదార్థాలు

గర్భంతో ఉన్నపుడు షుగర్ ఫూడ్'ని ఎక్కువగా తినకూడదు. వైద్యుడు తెలిపిన విధంగా 9 నెలలు కాకుండా, సరిపోయేంత షుగర్'ని తీసుకుంటే సరిపోతుంది. గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవటం మచిది కాదు అని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది.
మాంసం
డెలి మాంసాలు 'లిస్టిరియాసిస్'లను కలుగ చేసే వాటితో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇవి గర్భాన్ని నిరోధించే పదార్థాలను కలిగి ఉంటాయి కావున వీటిని గర్భ నిరోధక ఆహార పట్టికలలో చేర్చారు. కారణం ఇవి శరీరంలో వేడిని 165 డిగ్రీల వరకి పెంచి, మీకు మరియు మీ కడుపులో పెరుగుతున్న శిశువుకి హాని కలిగిస్తాయి. కావున గర్భ సమయంలో వీటికి దూరంగా ఉండండి.
ఇక్కడ తెలిపిన ఆహారాలు గర్భ సమయంలో చాలా సమస్యలను గురి చేస్తాయి, కావున మీరు తినే ప్రతి ఆహర పదార్థం గురించి పూర్తీ అవగాహన ఉండాలి. ఈ ఆహార పదార్థాల వలన మీ ఆరోగ్యం మాత్రమె కాకుండా, గర్భాశయంలోని శిశువు ఆరోగ్యం కూడా పాడవుతుంది. కావున వీటికి దూరంగా ఉండండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com