ఏపీ రాష్ట్రానికి 19 జాతీయ అవార్డులు

- June 19, 2017 , by Maagulf
ఏపీ రాష్ట్రానికి 19 జాతీయ అవార్డులు

ఉపాధిలో ఏపీకి పురస్కారాలు
ఢిల్లీలో కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రదానం
ఉత్తమ గ్రామ పంచాయతీగా హిమకుంట్ల
 ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి మళ్లీ అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా ఇచ్చే జాతీయ ఉత్తమ అవార్డులకు గాను 2015-16 సంవత్సరానికి సంబంధించి మన రాష్ట్రం 19 అవార్డులను దక్కించుకుంది. ఇందులో 3 రాష్ట్రస్థాయి అవార్డులు, 2 జిల్లా స్థాయి అవార్డులు, 4 మండలస్థాయి అవార్డులు, 10 పంచాయతీస్థాయి అవార్డులు ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీతనం కేటగిరిలో ఐదు అవార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు ఏర్పాటుకు అమలుపరుస్తున్న రూర్బన్‌ పథకానికి సంబంధించి ఒక అవార్డును రాష్ట్రం సాధించింది. రాష్ట్రస్థాయి అవార్డులు ఉత్తమ జిల్లా విభాగం: విజయనగరం జిల్లా పరిషత్‌ స్వశక్తీకరణ: అనంతపురం జిల్లా పరిషత్‌ మండల పంచాయతీ స్వశక్తీకరణ: నల్లజర్ల(ప.గోదావరి), చిత్తూరు, మార్కాపురం(ప్రకాశం), సంతబొమ్మాళి(శ్రీకాకుళం) ఉత్తమ గ్రామపంచాయతీ: హిమకుంట్ల(కడప) రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కారం: ముగడ(విజయనగరం) గ్రామ పంచాయతీ స్వశక్తీకరణ్‌: నంబూరు(గుంటూరు), చింతలపాలెం(నెల్లూరు), చినఅమీరం(ప.గోదావరి), పెదలబుడు(విశాఖ), ఎల్‌కేపీ(చిత్తూరు), జీమేడిపాడు(తూర్పుగోదావరి) ఉపాధి పథకంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి పోస్టల్‌ శాఖకు 2 అవార్డులు దక్కాయి. విశాఖపట్నం జిల్లా ముదగాడ బ్రాంచ్‌ బీపీఎం, రావికమతం సబ్‌పోస్టాఫీస్‌ ఎస్‌పీఎంకు లభించాయి. సోమవారం న్యూఢిల్లీలోని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతులమీదుగా ఈ అవార్డులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ బి.రామాంజనేయులు, ఇతర అధికారులు అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com