లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో సయ్యద్ రఫీకి చోటు

- June 20, 2017 , by Maagulf
లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో సయ్యద్ రఫీకి చోటు

దర్శక నిర్మాత సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో, తెలుగు భాషలో నిర్మించబడిన మధురం, ఇంకెన్నాళ్లు అనే రెండు చలన చిత్రాలకు తానే స్వయంగా పదహారు శాఖలు నిర్వహించినందుకు 'లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ ' వారు ఒక అరుదైన రికార్డును ఖరారు చేసి సర్టిఫికెట్ అందచేశారు. రఫీస్ మూవీ బ్యానర్ పై నిర్మించబడి,డిసెంబర్ ౩౦, 2011 లో ఇంకెన్నాళ్లు, జులై 12 , 2002 లో మధురం సినిమాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో నిర్మించబడ్డ ఇంకెన్నాళ్లు సినిమాకు మేధావుల, విమర్శకుల, సినారె లాంటి మహా కవుల ప్రశంశలతో పాటు ఉత్తమ సహాయనాటికి నంది అవార్డు కూడా దక్కింది. మధురం సినిమా పాటలుశ్రోతలకు, దృశ్యాలు యువతకు ఆకట్టుకున్నాయి. రఫీ స్వగ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా. విద్యార్ధి దశనుండే వివిధ కళలలో ప్రవేశం ఉన్నందువల్ల, రాష్ట్ర స్థాయి పోటీలలో పాలుగొని వివిధ రంగాలలో బహుమతులు దక్కడం వల్లే సెల్యులాయిడ్ పై కూడా ఇది సాధ్యపడిందని లిమ్కా వరల్డ్ రికార్డు గ్రహీత రఫీఅభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com