విజయ్ కోసం ఉచితంగా నటిస్తా జయం రవి
- June 20, 2017
తమిళ దర్శకుడు విజయ్ కోసం ఉచితంగా నటిస్తానని అంటున్నాడు తమిళ నటుడు జయం రవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వనమగన్'. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడుతూ.. 'మా నాన్న తర్వాత నాపై అంత ఖర్చు పెట్టిన వ్యక్తి విజయ్. సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నాను. ఒకవేళ దురదృష్టవశాత్తు సినిమా ఫ్లాప్ అయితే విజయ్తో కలిసి మరో చిత్రంలో ఉచితంగా నటించడానికి వెనుకాడను.' అని అన్నారు.
'అడవుల్లో చిత్రీకరణ, ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకడం, సినిమా కోసం చర్మం రంగు మార్చుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఇందులో నాకు ఎలాంటి డైలాగులు ఉండవు. నేను కేవలం ఓ అడవి మనిషిలానే ఉంటాను.' అని చెప్పుకొచ్చాడు రవి. ఈ చిత్రంలో రవికి జోడీగా సయేషా నటిస్తోంది. వనమగన్తో పాటు జయంరవి 'సంఘమిత్ర' చిత్రంలోనూ నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!







