సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే టాక్స్

- June 21, 2017 , by Maagulf
సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే టాక్స్

సౌదీ: సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే నెలకు 200 రియాల్స్ టాక్స్ పే చెయ్యాలి.  మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3,400 పన్ను చెల్లించాలని అక్కడి గవర్నమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది.  ఇప్పుడు అక్కడ భారత దేశానికి చెందిన 41 లక్షల మంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ కొత్త చట్టంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ.5,000 రియాల్స్ (రూ.85,000)జీతం వస్తున్న వారికే ఫ్యామిలీ వీసాలు ఇస్తున్నారు.  5వేల రియాల్ కంటే ఒక్క రియా తక్కువ వస్తున్నా ఫ్యామిలీ వీసాలు ఇవ్వడం లేదు.  అయితే ప్రతి సంవత్సరం ఈ పన్ను 100 రియాలు పెరిగే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.  రమదాన్ పండుగ సందర్బంగా సెలవులపై స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి సౌదీ వెళ్లేటప్పుడు టాక్స్ భారం మోయలేక భార్యా, పిల్లలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లడానికి సిద్దమవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com