సోమవారం ఈద్‌ అయితే వాహనదారులకి పండగే

- June 22, 2017 , by Maagulf
సోమవారం ఈద్‌ అయితే వాహనదారులకి పండగే

సోమవారం గనుక ఈద్‌ వస్తే వాహనదారులకు ఉచిత పార్కింగ్‌ సౌకర్యం వారం రోజులపాటు లభించినట్లవుతుంది. ఆర్‌టిఎ, శనివారం నుంచి వాహనదారులు పెయిడ్‌ పార్కింగ్‌ నుంచి ఉపశమనం పొందుతారని ఇప్పటికే ప్రకటించింది. సోమవారం గనుక ఈద్‌ వచ్చినట్లయితే వచ్చే శుక్రవారం వరకు పార్కింగ్‌ ఉచితమే అవుతుంది. ఈద్‌ అల్‌ పితర్‌ శెలవులు కూడా తెల్లవారు ఝామున 2 గంటల వరకు ఎక్స్‌టెండ్‌ చేయడం జరిగింది. గురువారం నుంచి సోమవారం వరకు ఈ సమయాలు వర్తిస్తాయి. ట్రామ్‌ ఆపరేషన్స్‌ ఉదయం 6.30 నిమిషాల నుంచి తెల్లవారు ఝాముఉన 1 గంటల వరకు జరుగుతాయి. పబ్లిక్‌ హాలీడే సందర్భంగా కొన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేకమైన ఈద్‌ టైమింగ్స్‌ని ఫాలో అవుతున్నాయి. దుబాయ్‌ మరియు అబుదాబీల్లోని కొన్ని ప్రభుత్వ శాఖలు తక్కువ వ్యవధిలో తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com