రక్త దానం చెయ్యండి విఐపీ కోటాలో షిర్డీలో బాబాను దర్శనం చేసుకోండి

- June 22, 2017 , by Maagulf
రక్త దానం చెయ్యండి విఐపీ కోటాలో షిర్డీలో బాబాను దర్శనం చేసుకోండి

ప్రసిద్ద షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం ఇక క్యూ లైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేదు. రక్తదానం చేస్తే ఇక షిర్డీ ఆలయంలో విఐపి హోదాలో దర్శనం చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది సాయిబాబా ట్రస్టు.
సాయిబాబాను దర్శించుకొనేందుకు వెళ్ళినవారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో విఐపీ హోదాలో దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు సత్రాల్లో కూడ బస విషయంలో కూడ విఐపి హోదాను కల్పిస్తారు.
సర్వమానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ట్రస్ట్ ఛైర్మెన్ సురేష్ హరే ప్రకటించారు. షిర్డిని బ్లడ్ బ్యాంక్ హబ్ గా మార్చడం తమ ఉద్దేశ్యమన్నారు.
తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్టుగానే షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తామన్నారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా మానవతా తృక్పథాన్ని చాటుకోవడంతో పాటు ఒక మంచి పనిచేశామనే సంతృప్తి కూడ దక్కనుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com