మాదకద్రవ్యాల కేసులో 7 గురు ఆసియా దేశస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
- June 22, 2017
రస్ అల్ ఖైమా: భారీ మొత్తంలో మాదకద్రవ్య పదార్ధాల నిల్వలను కనుగొన్న అనంతరం పోలీసులు ఏడుగురు మాదకద్రవ్య వ్యాపారులను అరెస్టు చేశారు.తమ స్వాధీనంలో ఉన్న అనుమానితులు అందరు ఆసియా జాతీయులని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తికి కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలలో ప్రమాదకరమైన రకాన్ని తమ వద్ద ఉందని ..కొనుగోలు చేయమని ప్రచారం చేస్తున్నారని సమాచారం పోలీసులు తెలుసుకొన్న పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. మాధకద్రవ్యాల విక్రేతలు ,వారి ఖాతాదారులందరూ అదే ఆసియ దేశాలకు చెందినవారని. పోలీసులు తెలిపారు. అనుమానితులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక జట్లుగా ఏర్పడి ఈ కేసుని చేధించినట్లు రాస్ అల్ ఖైమా పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ అలీ అల్ జైబి పేర్కొన్నారు. అనుమానితులు పోలీసుల గుర్తింపును నివారించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించారని, తమ జాతీయతకు చెందిన వ్యక్తులలోనే మాదకద్రవ్య వినియోగాన్ని ప్రోత్సహించారు. విచారణ సమయంలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారని దాంతో ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







