'జవాన్' ఫస్ట్ లుక్ విడుదల
- June 22, 2017
సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. మరోవైపు.. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్‌తో సాయిధరమ్ మూవీ ఉండబోతోందట.
సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'జవాన్'. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత బివిఎస్ఎన్ రవి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు పాటలు యాక్షన్ సీక్వెన్స్ మినహా చిత్రీకరణ పూర్తయింది. జూన్ 23 నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. జులై నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22న దర్శకుడు బివిఎస్ రవి బర్త్ డే సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
'తిక్క, విన్నర్' వంటి రెండు భారీ పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సాయిధరమ్ కెరీర్‌కు 'జవాన్' సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. సాయిధరమ్ నెక్స్ట్ మూవీ వినాయక్‌తో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో 'ఖైదీ నంబర్-150' తర్వాత స్టార్ హీరోస్తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడు వినాయక్. అయితే. ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీ అవడంతో.. ఇప్పుడప్పుడే వారి డేట్స్ దొరికేలా లేవు. ఈ లోపు.. సాయిధరమ్ వంటి యంగ్ హీరోతో వినాయక్ ఓ యాక్షన్ మూవీకి ప్లాన్ చేశాడట. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా కావడంతో సాయిధరమ్ కూడా ఇందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరి.. మెగాస్టార్‌కు రెండు భారీ విజయాలు ఇచ్చిన వినాయక్.. ఇప్పుడు మేనల్లుడితోనూ ఓ సూపర్ హిట్ తెరకెక్కిస్తాడేమో చూడాలి..!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







