మిథాలీరాజ్ అత్యంత అరుదైన రికార్డు బద్దలు చేసే అవకాశం
- June 22, 2017
మహిళల వన్డే ప్రపంచకప్ పోరుకు మిథాలీరాజ్ సేన సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో జూన్ 24న టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 7 మ్యాచ్లు ఆడనున్న తరుణంలో భారత సారథి, తెలుగమ్మాయి మిథాలీరాజ్ అత్యంత అరుదైన రికార్డు బద్దలు చేసే అవకాశం ఉంది.
మిథాలీరాజ్ ఇప్పటికే 100 వన్డేలకు సారథ్యం వహించిన మూడో మహిళా క్రికెటర్గా ఘనత పొందింది. ప్రస్తుతం 177 వన్డేల్లో 52.08 సగటుతో 5,781 పరుగులతో ఉంది. ఆమె మరో 212 పరుగులు చేస్తే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు బద్దలు అవుతుంది. వన్డేల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ 5992 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన మహిళగా ఉంది. ప్రస్తుత ప్రపంచకప్లో మిథాలీ 212 పరుగులు చేస్తే ఎడ్వర్డ్స్ను దాటేసి కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇక ప్రపంచకప్ను రికార్డు స్థాయిలో ఐదోసారి ఆడుతున్న మహిళగా నిలుస్తుంది. డెబ్బీ హాక్లె (న్యూజిలాండ్), క్లేర్ టేలర్, ఛార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) సైతం ఐదు సార్లు ప్రపంచకప్ ఆడారు.
తాజా వార్తలు
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!









