జూన్ 22న దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి
- June 22, 2017
తెలుగు చిత్రసీమ వెలుగును దశదిశలా ప్రసరింపచేసిన అరుదైన వ్యక్తుల్లో దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. జూన్ 22న ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి సందర్భంగా చిత్రసీమలో ఆయన సాగిన తీరును మననం చేసుకుందాం...
తెలుగు సినిమా పుట్టుక నుంచీ అనుబంధం ఉన్న నటదర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్... ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు పోషించి, ఆ పై నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా మారి మరపురాని చిత్రాలను మనకు అందించారు ఎల్వీ ప్రసాద్... మహానటులు యన్టీఆర్‌ను 'మనదేశం'తోనూ, శివాజీగణేశన్‌ను 'పరదేశి'తోనూ తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.
మాతృభాష తెలుగులోనూ, తమిళ, హిందీ భాషల్లోనూ ఎల్వీ ప్రసాద్ చిత్రాలను రూపొందించినా, అన్నీ కలిపి గుప్సెడు లేవు. అయినా ఆ చిత్రాల్లోనే తనదైన బాణీ పలికించి తెలుగువారి మదిలో చెరగని ముద్రవేశారాయన. ఎల్వీ ప్రసాద్ చిత్రాలు ఈతరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆయన స్థాపించిన సినిమా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పరచుకుని ఉన్నాయి. ఆయన నెలకొల్పిన 'ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్' దేశంలోనే అత్యున్నత నేత్ర చికిత్సాలయంగా పేరొందింది.
ఆయన వారసులు దేశంలోనే అతి పెద్ద ఐమాక్స్ థియేటర్‌ను భాగ్యనగరంలో నిలిపారు... అలా ప్రసాద్ పేరు తరతరాలు గుర్తుంచుకొనేలా ఆయన ఏర్పాటు చేసిన సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







