ఈద్ ఉత్సవాలను ప్రకటించిన ఆసియా టౌన్
- June 23, 2017
ఇబిన్ అజయన్ ప్రాజెక్ట్స్ ఆసియా టౌన్ లో ఈద్ వేడుక కార్యక్రమాన్ని ఆసియా టౌన్ మేనేజర్ లు ప్రకటించింది. ఇబిన్ అజయన్ ప్రాజెక్ట్స్ మోయి సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పండుగ రోజులలో ఆసియా టౌన్ లో అనేక వినోద కార్యక్రమాలు జరుగుతాయి. మోయి నిర్వహించనున్న ఈ రెండు రోజుల వినోదం , విద్యా కార్యక్రమాల నుండి, ఇతర కార్యక్రమాలను కూడా ఆసియా టౌన్ వద్ద ఇబ్న్ అజయన్ ప్రాజెక్ట్స్ చేత నిర్వహించబడతాయి. రెండు రంగస్థల ప్రదర్శనలు, ఒక నేపాలీ ప్రదర్శన మరియు ఒక భోజ్ పూరి కార్యక్రమం ఆసియా టౌన్ లోని అమ్ఫిథియేటర్లో ఈద్ మొదటి మరియు రెండవ రోజున నిర్వహించబడతాయి. ఈ వేడుకలో ప్రముఖ సినిమా,రంగస్థల కళాకారులు వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. క్రీడా ప్రేమికులకు సంతోషం కల్గించే ఇబ్న్ అజాయన్ రమాదాన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీ పండుగ మొదటి రోజు క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండవ రోజు కూడా ఆసియా టౌన్ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక ఈద్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఆసియా టౌన్లో మోయి అనేక అవగాహన కార్యక్రమాలు, మ్యూజిక్ షోను నిర్వహిస్తుంది. గాయకులు, నటన, రంగస్థల నాటకాలలో పలువురు కళాకారులు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం ఉంది. వీటిని తిలకించేందుకు కార్మికులు, కమ్యూనిటీ సభ్యులకు అవకాశాలు ఉంటాయి. మోయి ద్వారా రెండు రోజుల కార్యక్రమంలో వారికి బహుమతులు ఇవ్వబడతాయి.ఆసియా టౌన్ కతర్ లో ప్రవాసీయులకు ముఖ్య ప్రదేశంగా పేరు గాంచింది. మేము ఆసియా టౌన్‌లోని అన్ని పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం మేము ఆసియా టౌన్లో ఈద్ అల్ ఫితర్ ను జరిపేందుకు సిద్ధంగా ఉన్నాము. మేము ఆసియా టౌన్ సందర్శకుల అభిరుచులకు అనుగుణంగా పలు కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామని ఇబ్న్ అజయన్ ప్రాజెక్ట్స్ సంస్థకు చెందిన ఒక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







