అల్లుఅర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్' రివ్యూ

- June 23, 2017 , by Maagulf
అల్లుఅర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్' రివ్యూ

వరసగా బాక్సాఫీసు వద్ద హిట్ కొడుతున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ హీరో నటించిన 'దువ్వాడ జగన్నాథమ్' ఫిల్మ్ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున విడుదలైంది. బన్నీ పక్కన తొలిసారిపూజాహెగ్డే హీరోయిన్. ఈసారి కూడా బన్నీ అదే స్పీడ్ కంటిన్యూ చేశాడా? లేదా? చాలాగ్యాప్ తర్వాత డైరెక్టర్ హరీష్‌శంకర్ కూడా తన లక్‌ని పరీక్షించుకుంటున్నాడు. మరి స్టోరీ ఏంటో రివ్యూలోకి వెళ్లొద్దాం..
స్టోరీ: విజయవాడలోని సత్యనారాయణపురం అగ్రహారంలో వుంటాడు దువ్వాడ జగన్నాథమ్ శాస్ర్తి (అల్లుఅర్జున్). మాంచి శాఖాహార వంటగాడు కూడా! వంటలు చేసే శాస్త్రి, ఎవరికీ తెలియకుండా డీజేగా పరిచయం చేసుకొంటూ హైదరాబాద్‌లో పనుల్ని చక్కబెడుతుంటాడు. ఇక ఫ్యాషన్ డిజైనర్ పూజ (పూజాహెగ్డే). శాస్ర్తితో రిలేషన్ కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. సీన్ కట్ చేస్తే.. తాను టార్గెట్ చేసిన ఒకొక్కర్నీ చంపేస్తాడు శాస్ర్తి. ఇంతకీ శాస్త్రి.. డీజేగా ఎందుకు మారాడు? బ్రాహ్మణ యువకుడు హత్యలు చేసేవరకు ఎందుకు వెళ్తాడు? రొయ్యలనాయుడు (రావు రమేష్‌)తో శాస్త్రికి విభేదాలేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ దువ్వాడ జగన్నాథమ్ తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ: దువ్వాడ జగన్నాథమ్ సినిమా వన్‌మేన్ షో. మూవీ అంతా అల్లుఅర్జున్ భుజాలపైనే నడిచింది. సింపుల్‌గా చెప్పాలంటే బన్నీ చేసిన ప్రతీ ఫిల్మ్‌లోనూ రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి.. ఇందులోనూ అంతే! కాకపోతే శాస్ర్తి రోల్ మాత్రమే సినిమా హైలైట్. మిగతా అంతా రివేంజ్ ఫార్ములా. దీనికి కామెడీ, యాక్షన్, గ్లామర్‌ని టచ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హరీష్‌శంకర్. అల్లుఅర్జున్.. ఒకవైపు శాస్త్రి, మరోవైపు డీజేగా కనిపించి మెప్పించాడు. డీజేగా స్టైలిష్‌గా దర్శనమీయడం కొట్టినపిండే! శాస్త్రిగా చేసిన సందడే కొత్తదనాన్ని పంచుతుంది. భాష, యాస విషయాల్లో ఫస్టాప్ అంతా నడిచిపోతుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ యాక్షన్ పార్ట్‌ని మరింత పెంచింది. సినిమాకి మరో ప్లస్ పాయింట్ హీరోయిన్ పూజాహెగ్డే. ఆమె పాత్రకి పెద్దగా ప్రయార్టీ లేకపోయినా, అందంతో ఆకట్టుకుంది.
బన్నీతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళిశర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు పరిధి మేరా ఓకే. సాంకేతికంగా డీజే పర్వాలేదు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ప్రాణం పోసింది. కెమెరా వర్క్ బాగుంది. ఇక మైనస్‌కి వస్తే, చాలావరకు సన్నివేశాలు ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లే సాగుతాయి. స్టోరీలో ఎలాంటి ట్విస్ట్‌లు లేవు. క్లైమాక్స్ ఓ రేంజ్‌లో వుంటుందని భావించిన వాళ్లకి డీజే కామెడీతో సరిపెట్టేశాడు డైరెక్టర్. మొత్తానికి కామెడీతో కాలక్షేపం చేశాడే తప్ప, చెప్పుకోదగిన స్టోరీతో రక్తి కట్టించలేదన్నది సగటు ఆడియన్స్ మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com