'మహా పరివర్తన' పేరుతో దేశంలోనే మహిళా ఖైదీల తొలి పెట్రోల్బంక్

- June 23, 2017 , by Maagulf
'మహా పరివర్తన' పేరుతో దేశంలోనే మహిళా ఖైదీల తొలి పెట్రోల్బంక్

'మహా పరివర్తన' పేరుతో జైళ్లలో సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్ దేశంలోనే తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంక్ను ప్రారంభించింది. చంచల్గూడ్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. ఈ మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటుతో విడుదలైన 25 మంది మహిళా ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన ఖైదీలు గౌరవంగా జీవించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పెట్రోల్ బంక్ల నిర్వహణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు వీటిల్లో పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ ఆయిల్ కంపెనీ భాగస్వామ్యంలో చంచల్గూడ జైల్లో ప్రయోగాత్మకంగా పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల ప్రాంగణాలు, ఇతర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. ఈ పెట్రోల్ బంకులో పనిచేసే మహిళా ఖైదీలకు ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com