ఇరాక్‌లో అతిపురాతన మసీదు ధ్వంసం
- June 23, 2017
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద గ్రూపునకు అత్యంత బలమైన ప్రాంతం మోసుల్ నగరం. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం ఐఎస్-అమెరికా సంకీర్ణ బలగాల మధ్య సాగుతున్న పోరు భీకర రూపం దాల్చింది. సంకీర్ణ బలగాలు, ఉగ్రవాద నిరోధక దళం, ఇరాక్ సైన్యం, ఫెడరల్ పోలీస్...అంతా కలిసి మోసుల్ పాతబస్తీని అన్ని వైపుల నుంచి చుటుముట్టి దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో గల 800 సంవత్సరాల క్రితంనాటి చారిత్రక కట్టడం 'అల్ నూరీ' మసీదు పూర్తిగా ధ్వంసమైంది. ఐఎస్ ఈ పనిచేసిందని అమెరికా సంకీర్ణదళాలు, కాదు...అమెరికా సంకీర్ణదళాలే వైమానిక దాడులు జరిపి మసీదును ధ్వంసం చేశాయని ఐఎస్ ఆరోపించుకున్నాయి. ఏదేమైనా.. అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్ కోల్పోయింది. 800 ఏండ్ల కిత్రం 'నూర్ అల్ దిన్ మహ్మద్ జంగీ' ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది.
ఈ మసీదులోని అత్యంత ఎత్తయిన స్తంభం (మినార్) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అంతేగాక.. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది.. మూడేండ్ల క్రితం ఈ మసీదులోనే తనకు తాను కలీఫాగా ప్రకటించుకున్నాడు.ఐఎస్ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది.
'అల్ నూరీ మసీదు ధ్వంసమైంది.అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







