గ్రాండ్ మసీద్ సందర్శకులకు హాస్పిటల్ సేవల ఏర్పాటు
- June 24, 2017
మక్కా: మక్కా గవర్నటీ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్, తరఫున డిప్యూటీ ప్రిన్స్ అబ్దుల్లా అల్-సౌద్ ఇటీవలే 50 పడకల అత్యవసర ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి తౌఫీక్ అల్-రబీయా సమక్షంలో ప్రారంభించారు. ఈ ఆసుపత్రి లో అధునాతన వైద్య పరికరాలు కలిగి ఉంది, 10 పడకల అత్యవసర సేవల విభాగం (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) కలిగి ఉంది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి అల్-రబీయా మాట్లాడుతూ గ్రాండ్ మసీద్ కు ఉత్తరాన ఉన్న ఈ ఆసుపత్రికి వచ్చే సందర్శకులకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. స్థానిక మరియు విదేశీ యాత్రికులు తరలి వచ్చే వారి ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని హజ్ మరియు ఉమ్రా సమయంలో కోసం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. రాజధాని మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ మసీదును సందర్శిస్తున్నారు. మక్కా ఆరోగ్య వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ తెలిపిన వివరాల ప్రకారం, మక్కాలోని ఆస్పత్రులు మరియు ఆరోగ్య సౌకర్యాలు పవిత్ర నెలలో ఏర్పాటుచేయగా మొదటి మూడు వారాలలో 50,000 మంది అత్యవసర కేసులకు ఇక్కడ చికిత్స చేశాయి. క్లినిక్లులలో 27,000 మంది రోగులకు చికిత్సలు చేశారు. 600 మంది పిల్లలకు ఇక్కడ కాన్పులు (డెలివరీలు) జరిపేరు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







