పోర్చుగల్ చేరుకున్నభారత్ ప్రధాని
- June 24, 2017
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పోర్చుగల్ చేరుకున్నారు. లిస్బన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. మోదీ రాక నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటాలతో హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా.. పోర్చుగల్ ప్రధాని అంటానియో కోస్టాతో మోదీ భేటీ కానున్నారు.
పోర్చుగల్ నుంచి ప్రధాని మోదీ అమెరికా బయల్దేరుతారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఇస్తున్న విందులో పాల్గొంటున్న తొలి దేశాధినేత మోదీనే కావడం విశేషం. అమెరికా నుంచి మోదీ నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టేతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







