ట్రీట్‌మెంట్ కోసం ఇండియాకి 90 మంది యెమనీలు
- June 24, 2017
న్యూఢిల్లీ: రెండో బ్యాచ్ యెమనీ పేషెంట్లు, ఇండియాకి చేరుకున్నారు. గత కొంతకాలంగా యెమెన్‌లో యుద్ధ వాతావరణం కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్యులు గాయపడ్తున్నారు. మానవీయ కోణంలో యూఏఈ నాయకత్వం అలాంటివారికి వైద్య చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు బాధితుల్ని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నారు. తాజా ఘటనలో 90 మంది పేషెంట్లు, ఇండియా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానం దిగగానే వారిని ఆయా ఆసుపత్రులకు తరలించేందుకోసం ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. విపిఎస్ రాక్‌లాండ్ హాస్పిటల్స్ కార్పొరేట్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 39 అంబులెన్సులు ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రులకు బాధితుల్ని తరలించాయని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అలాగే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మేరకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారాయన. పేషెంట్లలో కొందరికి తగిలిన గాయాలు ఇన్‌ఫెక్షన్‌కి గురయినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







