మానస్ హీరోగా ‘సోడా గోలిసోడా’ లో మెసేజ్
- June 24, 2017
మానస్, నిత్యా నరేష్, కారుణ్య, అలీ ముఖ్య తారలుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సోడా గోలిసోడా’. ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోదావరి జిల్లాలో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిబాబు మాట్లాడుతూ – ‘‘పదిమంది హాయిగా నవ్వుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. మరో పది రోజుల్లో సెకండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేస్తాం. ఆగస్టులో ఆడియో లాంచ్‌కి ప్లాన్ చేస్తున్నాం.
కెమెరామేన్ ముజీర్ మాలిక్ తీసిన ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. కథ వినగానే అవకాశం ఇచ్చిన సింధూజగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి మేసేజ్‌ని చక్కని కామెడీతో కలిపి సినిమా తీస్తున్నాం. హరిబాబు చాలా క్లారిటీతో సినిమా తీస్తున్నారు. అలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతంరాజు కామెడీ అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు సింధూజ. ‘‘బీడు భూముల్లో కూడా పంటలు పండించవచ్చనే మెయిన్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైనింగ్ సినిమా సాగుతుంది’’ అన్నారు నటుడు అలీ. ఈ చిత్రానికి సంగీతం: భరత్, కో–ప్రొడ్యూసర్: భువనగిరి శ్రీనివాస మూర్తి, ఎడిటర్ నందమూరి హరి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







