పాకిస్తాన్లో రక్తసిక్తం: మూడుచోట్ల పేలుళ్లు, 80 మంది వరకు మృతి
- June 24, 2017
పాకిస్తాన్లో రక్తం చిందింది. రంజాన్ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా ఉన్న మార్కెట్లో, ఐజీ కార్యాలయం వద్ద గస్తీలో ఉన్న పోలీసులపైనా, రహదారి పక్కనున్న రెస్టారెంట్‌లోని జనం లక్ష్యంగా బాంబు పేలుళ్లు, కాల్పులు చోటు చేసుకున్నాయి.
రెండు నగరాలలో జరిగిన పేలుళ్లు, మరో సిటీలో జరిగిన కాల్పులలో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
షియాలు ఎక్కువగా ఉండే కుర్రమ్ ట్రైబల్ రీజియన్‌లోని పరాచినార్లో పండుగ షాపింగ్ చేస్తున్న జనంతో రద్దీగా ఉన్న తురి మార్కెట్ వద్ద జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ బాంబు దాడిలో 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. మరోవైపు బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో క్వెట్టాలోని ఐజీ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడ ఏడుగురు పోలీసులు సహా 13 మంది ప్రాణాలు కోలోయారు.
ఆ తర్వాత శనివారం సాయంత్రం కరాచీలోని రహదారి పక్కనున్న రెస్టారెంట్ వద్ద ఇద్దరు అగంతకులు కాల్పులకు దిగారు. ముఖాలకు హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, తామే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు లష్కర్ ఈ జాంగ్వీ ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







