వాహనాల క్రాష్‌ హిస్టరీని చెప్పేస్తుంది

- October 14, 2015 , by Maagulf
వాహనాల క్రాష్‌ హిస్టరీని చెప్పేస్తుంది

సెకెండ్‌ హ్యాండ్‌ వాహనాల్ని కొనుగోలు చేయడం ద్వారా అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వినియోగదారులకి. ఆ వాహనం యొక్క గత చరిత్రను తెలుసుకోవడం వాహనదారులకు కష్టమైన విషయం. ఆ సమస్యలనుంచి వాహనదారులను గట్టెక్కించేందుకు ఓ వెబ్‌సైట్‌ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ మరియు ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు సంయుక్తంగా రూపొందిస్తున్న కార్యాచరణలో ఈ వెబ్‌సైట్‌ కూడా భాగం. ఈ వెబ్‌సైట్‌లో వాహనాల క్రాష్‌ హిస్టరీని చూసి, వాహనాన్ని కొనాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. ఇది చాలా మంచి నిర్ణయమని సెకెండ్‌ హ్యాండ్‌ వెహికిల్‌ కొనాలనుకుంటున్న ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. వాడిన కార్లను అమ్మే సంస్థ యజమాని జసిమ్‌ అల్‌ హర్తి చెబుతూ, పబ్లిక్‌కి ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎంతో ఉపయోగముంటుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com