డైరెక్టర్, యాక్టర్ ప్రభుదేవా విలన్‌గా

- June 25, 2017 , by Maagulf
డైరెక్టర్, యాక్టర్ ప్రభుదేవా విలన్‌గా

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రభుదేవా ' ప్రేమికుడు ' సినిమాతో హీరోగా టర్న్ అయి సక్సెస్ అయ్యాడు. తరువాత డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టి ' నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో డైరెక్టర్‌గా టర్న్ అయ్యాడు. తరువాత డైరెక్టర్ గా బాలీవుడ్ లో కూడా తన మార్క్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇక తమన్నా లీడ్ రోల్ చేసిన ' అభినేత్రి ' ..తమిల్ లో ' భోగన్ ' లాంటి సినిమాలతో ప్రొడ్యూసర్‌గా మారాడు.
ఇప్పుడు విలన్‌గా టర్న్ తీసుకోబోతున్నాడట ప్రభుదేవా. ' పిజ్జా ' లాంటి థ్రిల్లర్ తీసిన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రాబోయే న్యూమూవీలో విలన్‌గా కనిపిస్తాడట ప్రభుదేవా. ' మెర్క్యూరీ ' టైటిల్ తో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ మూవీలో ప్రభుదేవా క్యారెక్టర్ హైలెట్ అవుతుందనేది కోలీవుడ్ మాట. మరి హీరోగా, డైరెక్టర్ గా సక్సెస్ అయిన ప్రభుదేవా విలనిజం ఏ రేంజ్ లో చూపిస్తాడో!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com