భారత్ దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు..
- June 25, 2017
రంజాన్ సందడి షురూ అయింది. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు పండగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆనందంగా పండగ చేసుకోవాలని ముఖ్యమంత్రులు పిలుపిచ్చారు.
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతోనే పండుగ సందడి కనిపించింది. రంజాన్ సందర్భంగా జరుపుకునే ఈదుల్ ఫితర్ ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, దర్గాలను సుందరంగా అలంకరించారు. ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక వసతులు కల్పించారు.
ముస్లిం సోదరులకు గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని ఆకాంక్షించారు. మత సామరస్యానికి, సరస్వత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆనందంగా పండుగ చేసుకోవాలని ఆకాక్షించారు. సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు సదా అనుసరణీయమని సీఎంలు అభిప్రాయపడ్డారు.
ప్రార్థించే పెదవులకన్నా సాయమందించే చేతులే మిన్న అన్న సూక్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పండగే రంజాన్. దీన్ని ఉపవాసాల పండుగ, దాన ధర్మాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈద్గా మైదానాల్లో, మసీదుల్లో జరుపుకునే నమాజ్ ప్రార్థనలనే ఈదుల్ ఫితర్ ప్రార్థన అంటారు. నమాజ్ ప్రార్థనల అనంతరం పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా పరస్పర ఆలింగనం చేసుకుని సంతోషంగా ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించాలని ప్రార్థిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







