తొలిసారి ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ముస్లీంలకు ఇఫ్తార్ విందు
- June 26, 2017
ఉడుపి: ఉడుపి మఠం చరిత్రలోనే తొలిసారిగా పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ ఇఫ్తార్ విందు ఇచ్చారు. శనివారం సాయంత్రం మఠం ప్రాంగణంలోని అన్నబ్రహ్మ సత్రంలో ముస్లిం సోదరులకు ఖర్జూరాల్ని అందచేసి ఉపవాస దీక్షలను విరమింప చేశారు.
అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం మధ్వాచార్యుడు శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించిన అనంతరం తొలిసారిగా విశ్వేశతీర్థ ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం.
పంక్తి భోజనంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు వడ్డనను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. వారితో కాసేపు ముచ్చటించారు.
ఈ విందులో దాదాపు 150 మంది ముస్లీం సోదరులు పాల్గొన్నారు. విందుకు వచ్చిన వారు సాయంత్రం గం.6.59 నిమిషాలకు తమ దీక్ష విరమించారు. అరటి, పుచ్చకాయ, యాపిల్, కాషూ నట్స్ తదితరాలను విందులో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







