'గరుడవేగ' సినిమా కోసం ప్రముఖ స్టంట్ బైకర్

- June 27, 2017 , by Maagulf
'గరుడవేగ' సినిమా కోసం ప్రముఖ స్టంట్ బైకర్

హైదరాబాద్: రాజశేఖర్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'గరుడవేగ 126.18 ఎమ్'. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా జార్జియాలో జరుగుతోంది. కాగా చిత్రం కోసం జార్జియాకు చెందిన ప్రముఖ స్టంట్ బైకర్ జియోర్జి ఒడ్జెలాష్విలి పనిచేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఛేజింగ్ సన్నివేశాన్ని ఆయనతో తెరకెక్కిస్తున్నట్లు పేర్కొంది. ఆయనతోపాటు లాడో గుడాడే, జియోర్జి అబాషిజ్ కూడా ఈ బైక్ ఛేజింగ్లో ఉన్నారని తెలిపింది. జియోర్జి ఒడ్జెలాష్విలికి 'జార్జియా నం.1 డేర్ డెవిల్-2015' అవార్డు లభించింది.

ఈ సన్నివేశాన్ని జనాలతో రద్దీగా ఉన్న ప్రాంతంలో చిత్రీకరిస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. సన్నిలియోని ఇందులోని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. 'కబాలి' ఫేం కిశోర్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. పోసాని, నాజర్, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com