ఉదయ్ కిరణ్ పేరు మీద అవార్డులు ప్రదానం
- June 27, 2017
హైదరాబాద్: 'చిత్రం', 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు ఉదయ కిరణ్. జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో నివాళులర్పించారు. నిర్మాత ఎన్.ఎస్. నాయక్, సందీప్ రెడ్డి, వీరేశ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కార్యక్రమానికి హాజరై ఉదయ్కిరణ్కు నివాళులర్పించారు. ఉదయ్కిరణ్తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్-2017' విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఆనంద్ కుమార్ తెరకెక్కించిన 'ప్రజాహక్కు'కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు దక్కింది. వి. అవంతిక, ఎ. హాసిని ఉత్తమ బాలనటి అవార్డులు అందుకున్నారు.
ఆనంద్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







