అమ్మకానికి ఎయిర్ ఇండియా
- June 28, 2017
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా అమ్మకానికి మరో కీలక అడుగు పడింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఎయిర్ ఇండియా అమ్మకానికి ఆమోదం లభించింది. మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు.
ప్రైవేటు వ్యక్తులు ఎయిర్ ఇండియా సంస్థలో చేరడం వల్ల సంస్థ మరింత నాణ్యంగా, వేగంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు. ఆర్థికమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుకు చేయాలన్న విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కూడా క్యాబినెట్ సమ్మతించిందని తెలిపారు. వాటాల అమ్మకం, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.
కాగా ఎయిర్ ఇండియాలో నష్టాలను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సుమారు రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే .
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







