ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన నాని

- June 29, 2017 , by Maagulf
ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన నాని

సోషల్మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వృత్తి.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు హీరో నాని. అందుకే ఆయన సోషల్మీడియా ఖాతాలను లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఎప్పుడూ కూల్గా ఉండే నాని.. సోషల్మీడియాలో తన అభిమానులుగా చెప్పుకునే వారి తీరును తప్పుపట్టారు. వైఖరి మార్చుకోవాలని సూచించారు. నాని ఎందుకిలా చేశారు? అసలేం జరిగింది?

'నాని ఫనాటిక్' పేరిట ఓ ట్విటర్ పేజీ ఉంది. ఇందులో నాని అభిమానులుగా పేర్కొంటూ ఆయన సినిమాల గురించి పోస్ట్ చేస్తుంటారు. ఇందులో పోస్ట్ చేసే ట్వీట్లను నాని రీట్వీట్ చేస్తుంటారు. అయితే.. ఈ పేజీలో ఇటీవల ఇతర నటుల గురించి చులకన చేస్తూ వ్యాఖ్యలు చేయటాన్ని నాని సహించలేకపోయారు.

దీని గురించి తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు నాని. 'మీరంతా నా అభిమానులని చెప్పుకుంటున్నారు. అందుకు ధన్యవాదాలు. కానీ మీరు ఇతరులపై చేస్తున్న ట్వీట్లను ఒకసారి గమనించండి. మీ భాష, తీరు మార్చుకోండి.. లేదంటే మీ ట్విటర్ ఖాతా పేరు.. ప్రొఫైల్ పిక్చర్ అయినా మార్చండి' అని ట్వీట్ చేశారు.

నాని ప్రస్తుతం 'నిన్ను కోరి' చిత్రంలో నటిస్తున్నారు. నివేథా థామస్ కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జులైలో విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com