రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మరో యువ నటుడు

- June 29, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మరో యువ నటుడు

గత వారం సినీ నటుడు రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదం లో మరణించిన విషయం ఇంకా మరచిపోకముందే మరో యువ నటుడు అస్లాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. వరంగల్ ప్రాంతానికి చెందిన అస్లాం..సినిమాల ఫై ఇష్టం తో హైదరాబాద్ కు వచ్చాడు..తన ఫ్రెండ్ సాయం తో చిన్న చిన్న రోల్స్ చేసి ప్రేమమయం అనే మూవీ లో హీరో గా ఛాన్స్ కొట్టేసాడు.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆడియో విడుదలయ్యింది. వచ్చే నెల సినిమా విడుదలకు సిద్ధం చేశారు. రంజాన్‌ పండుకు అస్లాం హైదరాబాద్‌ నుంచి శివనగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ఇద్దరు ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ-హైదరాబాద్‌ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్‌ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో అస్లాంకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే సికిందరాబాద్‌లోని ఎంజీఎంకు తరలించారు. అస్లాం మృతదేహం పోస్టుమార్టం పూర్తి చేసుకుని గురువారం తన ఇంటికి మృత దేహాన్ని పంపించారు..సినిమాల్లో రాణిస్తాడని ఎన్ని కలలు కన్నా ఆ తల్లిదండ్రులకు కొడుకు మరణం తో తీవ్ర దిగ్బ్రాంతికి గురైయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com