ఆసుపత్రిలో కాల్పులు, 6 మృతి
- June 30, 2017
అమెరికాలోని న్యూయార్క్ లీబాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి.ఓ వ్యక్తి తుపాకీ బ్రోనెక్స్ లీబానాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని అధికారులు చెప్పారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడ మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు. అమెరికా కాలమానప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తకుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. పోలీసులు ఆసుపత్రిలోని ప్రతి ఫ్లోర్ ను వెతుకుతున్నారు. 17 అంతస్థుల భవనంలో ఈ ఆసుపత్రి నిర్మించి ఉంది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని అధికారులు ప్రకటించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడ మరణించాడని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







