సెర్బియాలో వివేగం చిత్ర యూనిట్
- June 30, 2017
వివేగం చిత్రం మరోసారి యూరప్ దేశాలకు వెళ్లనుందన్నది తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకి, అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తున్న ఇందులో హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే వివేగం చిత్రంలో వివేక్ ఓబెరాయ్‌ది విలన్ పాత్ర కాదని ఆ చిత్ర దర్శకుడు శివ ఇటీవల వెల్లడించారు. కాగా సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సర్వైవా అనే సింగిల్ సాంగ్ విడుదలై అజిత్ అభిమానుల్ని ఖుషీ పరుస్తున్నాయి. అజిత్ ఇటర్‌పోల్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆయన అభిమానులు చిత్ర విడుదల ఎప్పుడెప్పుడాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా వివేగం చిత్రం పూర్తిగా యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ముఖ్యంగా బల్గేరియాలో అధిక భాగం షూటింగ్‌ను నిర్వహించారు. ఇటీవలే షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్ చెన్నై చేరుకుంది. కాగా మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి సెర్బియా వెళ్లనున్నట్లు చిత్ర దర్శకుడు శివ తెలిపారు. కాగా వివేగం చిత్రాన్ని ఆగస్ట్ నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







