పాక్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారత ఖైదీలకు విముక్తి
- July 01, 2017
పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. పాక్ లో ఎన్నో ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వీరిని భారత్కు పంపివేసినట్లు పాక్ ప్రభుత్వం శనివారం ఓ జాబితా విడుదల చేసింది. 2008 మే21న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం హైకమిషనర్ గౌతమ్ బాంబవాలేకు ఖైదీల జాబితా అందజేసింది.
విడుదలకానున్న 546 మంది భారతీయులలో 52 మంది సామాన్య ప్రజానికం ఉండగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరి 1న, జులై 1న ఇలా రెండు పర్యాయాలు పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేందుకు గాను వారి జాబితా విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ విడుదల చేయనున్న తమ దేశ ఖైదీల జాబితా కోసం ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







