యూఏఈ జలాలలో చిక్కుకుపోయిన 100 మంది భారతీయ నావికులు
- July 02, 2017
దుబాయ్: అరబ్ జలాల్లో ఉన్న 22 నౌకల్లో దాదాపు వందమంది వరకు చిక్కుకుపోయిన భారత నావికులు తమను రక్షించాల్సిందిగా దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్నివేడకుంటున్నారు. ఈ విషయమై భారత దౌత్య అధికారి విపుల్ మాట్లాడుతూ యూఏఈ జలాల్లో చిక్కుకుపోయిన నావికుల నుంచి రక్షించమని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. మొత్తం 22 నౌకల్లో 97 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిలో ఉన్న విదేశీ సిబ్బంది గురించిన సమాచారం రాయబార కార్యాలయం వద్ద లేదన్నారు. అయితే అందులో శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన నావికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి గత కొన్ని నెలలుగా వేతనాలు అందడం లేదని, ఆహార పదార్థాలు, తాగునీరు, ఇంధనం కూడా నిండుకున్నట్టు నావికులు చెబుతున్నట్టు విపుల్ తెలిపారు. తమను తిరిగి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు కోరుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో వారి వేతనాలు చెల్లించేలా యజమానులు, ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురానున్నట్టు రాయబార కార్యాలయం తెలిపింది. మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఎంవీ గల్ఫ్ పెరల్, ఎంవీ ఆయా, ఎంజాజ్ 2, ఎంవీ సలీమ్, ఎంవీ రాక్, అల్ హమద్1 నౌకల్లో చిక్కుకుపోయిన 36 మందిని రక్షించి సొంత దేశాలకు పంపారు. కొందరికి నీళ్లు, ఆహారం, ఇంధనం సమకూర్చడంతోపాటు వారి మొబైల్ ఫోన్లను రీచార్జ్ కూడా చేసినట్టు విపుల్ తెలిపారు. త్వరలోనే మిగతా వారిని కూడా రక్షించి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







