మహిళపై నాలుగో సారి యాసిడ్ దాడి

- July 02, 2017 , by Maagulf
మహిళపై నాలుగో సారి యాసిడ్ దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోదారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురై కుమిలిపోతున్న ఓ వివాహితపై దుండగులు నాలుగో సారి యాసిడ్‌ దాడి చేశారు.

వివరాల్లోకెళితే.. రాయ్‌బరేలిలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల వివాహితకి ఇద్దరు పిల్లలు. 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరస్ట్‌ చేశారు. ఆ తర్వాత 2011లో ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకుండానే 2013లో మరోసారి యాసిడ్‌ దాడి జరిగింది.
అప్పటినుంచి ఆమె అలిగంజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ యాసిడ్‌ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్‌లో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో బాధితురాలు రైలులో లఖ్‌నవూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మహిళపై యాసిడ్‌ దాడి చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆమెను హాస్పిటల్‌లో పరామర్శించి పరిహారం కూడా చెల్లించారు. యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని అరెస్ట్‌ చేశారు.

తన జీవితంలో ఇన్ని దారుణ ఘటనలు చోటుచేసుకున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన బతుకేదో తాను బతుకుంటే నాలుగోసారి ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్‌ పోసి పరారయ్యారు. ఈ ఘటనలో కుడి వైపు ము ఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లఖ్‌నవూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుంటామని వెల్లడించారు. మరోపక్క మహిళపై గతంలో అత్యాచారం చేసిన నిందితులే ఇప్పుడు ఆమెపై యాసిడ్‌ దాడులకు పాల్పడుతున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com