'యంఎల్ఏ: మంచి లక్షణాలున్న అబ్బాయి' గా రానున్న కళ్యాణ్ రామ్
- July 02, 2017
కల్యాణ్రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యంఎల్ఏ: మంచి లక్షణాలున్న అబ్బాయి'. కాజల్ కథానాయిక. ఉపేంద్ర మద్వానీ దర్శకుడు (నూతన పరిచయం). ఈ చిత్రం షూటింగ్లో ఆదివారం నుంచి కాజల్ పాల్గొంటున్నారు. తొలిరోజు చిత్రీకరణలో కల్యాణ్రామ్, బ్రహ్మానందంతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను కాజల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తన తొలి సహనటుడుతో కలిసి మళ్లీ పనిచేస్తున్నానని, పాత రోజులు గుర్తొస్తున్నాయని ట్వీట్ చేశారు.
బ్ల్యూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా 'యంఎల్ఏ'ను నిర్మిస్తున్నాయి. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. మే 10న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. 'ఇజం' చిత్రంతో కల్యాణ్రామ్ 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జై లవకుశ'కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత కాజల్ 'యంఎల్ఏ'లో నటిస్తున్నారు. ఇవి కాకుండా ఆమె పలు తమిళ చిత్రాల్లోనూ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







