పెళ్లిలో చిందులేసిన తమన్నా
- July 02, 2017
మిల్కీబ్యూటీ తమన్నా తన సోదరుడు ఆనంద్ భాటియా వివాహ వేడుకలో సందడి చేశారు. ఆనంద్ అమెరికాలో వైద్యుడుగా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులు కృతికా చౌదరితో ఆయన పెళ్లి నిశ్చయించారు. గత కొన్ని రోజులుగా ఈ వివాహ వేడుక జరుగుతోంది. ముంబయిలోని ఐదు నక్షత్రాల హోటల్లో ఏర్పాటు చేసిన సంగీత్, మెహందీ ఫంక్షన్లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'అవంతిక' లెహంగాలలో చాలా అందంగా కనిపించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. తమన్నా కూడా కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన సోదరుడి మెహందీ ఫంక్షన్లో చాలా సరదాగా గడిపినట్లు పేర్కొన్నారు. తమన్నా ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ సరసన ఓచిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాకుండా రెండు తమిళ చిత్రాలు, ఒక హిందీ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







