తమ్ముడు అంత్యక్రియలు అద్దె వ్యక్తి తో చేయించాల్సిన ఖర్మ మాకు లేదు

- July 02, 2017 , by Maagulf
తమ్ముడు అంత్యక్రియలు అద్దె వ్యక్తి తో చేయించాల్సిన ఖర్మ మాకు లేదు

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజా రవితేజ తమ్ముడు భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విధితమే.. భరత్ దుర్మరణం... రవితేజ ఫ్యామిలీ కడసారి చూడడానికి రాకపోవడం.. కనీసం మృత దేహం ను ఇంటికి తీసుకొని వెళ్లకుండా.. గాంధీ ఆస్పత్రి నుంచి సరాసరి అంత్యక్రియలకు స్మశాననికి తీసుకొని వెళ్ళడంతో రవితేజ అండ్ ఫ్యామిలీ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.. పైగా రవితేజ తమ్ముడు పోయిన మర్నాడే.. సినిమా షూటింగ్ లో పాల్గొనడం అగ్గి కి ఆజ్యం పోసినట్లు అయ్యింది.. నెటిజన్లు రవితేజ ప్రవర్తనపై తీవ్రంగా స్పందించారు.. కాగా తాజాగా రవితేజ తన తమ్ముడు మరణం పట్ల.. నెటిజన్లు తనపై తీవ్రంగా విమర్శలతో స్పందించడం పట్ల విచారణ వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో తన బాధను... భరత్ మరణించిన సమయంలో తన కుటుంబ పరిస్థితిని వివరించాడు.. తమ్ముడు పోయిన బాధలో తమ ఫ్యామిలీ ఉంటే.. అంత రాధ్దంతం చేయడం ఎందుకు అని ప్రశ్నించాడు.. భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు అని తెలియగానే అందరం షాక్ తిన్నాం... మా నాన్నగారికి ఇప్పుడు 85 ఏళ్ళు.. అమ్మ రాజ్యలక్ష్మి కి అనారోగ్యం తమ కొడుకు తమ కళ్ల ముందే మరణించాడు అనే వార్త విన్న వెంటనే వారి పరిస్తితి చెప్పనలవి కాదు.. తమ్ముడు రఘు ని భరత్ దగ్గరకు పంపించాము.. తను ముఖం మొత్తం ఛిద్రమై పోయిందని చెప్పడంతో చూడలేక వెళ్లలేదు.. అమ్మానాన్నల దగ్గర నేను ఉన్నా... భరత్ అంత్యక్రియలు అద్దెకు తెచ్చిన వ్యక్తి తో చేయించాలసిన ఖర్మ మాకు లేదు.. తమ్ముడు రఘు తలకొరివి పెట్టకూడదు అని పెద్దలు చెప్పడంతో.. మా బాబాయ్ తో అంత్యక్రియలు జరిపించాము.. కానీ అద్దెకు తెచ్చిన మనిషితో అంత్యక్రియలు అనే వార్తలు చూడగానే మేము అవేదనకు గురయ్యాము అని చెప్పాడు. తనతో కలిసి పెరిగిన తమ్ముడు అత్యంత దారుణంగా మృతి చెందాడు అని తెలిసి నేనే ఎంత బాధపడ్డానో.. నాకు తెలుసు.. మేము కూడా మనుషులమే.. మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి.. మా పర్సనల్ లైఫ్ లోకి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చే హిట్స్ కోసం కామెంట్స్ చెయ్యడం మమల్ని తీవ్రంగా కలచి వేసింది అని రవితేజ తన బాధను నెటిజన్ల కామెంట్స్ పై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com